News September 2, 2024

ఈ రోడ్డుపైకి వెళ్లొద్దు..!

image

విజయవాడ, హైదరాబాద్ మధ్య సూర్యాపేట మీదుగా నిన్న మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్ వద్ద పాలేరు నది ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోయింది. దీంతో NH-65పైకి రావొద్దని అధికారులు సూచించారు. వరద తగ్గాక మరమ్మతులు చేపడతామన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు.

Similar News

News February 2, 2025

CTలో రోహిత్, కోహ్లీలది కీలక పాత్ర: గంభీర్

image

ఇటీవల ఇంటర్నేషన్ క్రికెట్‌తోపాటు రంజీ ట్రోఫీలోనూ విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కోచ్ గంభీర్ వెనకేసుకొచ్చారు. వారు డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్ద పాత్రను పోషించబోతున్నారన్నారు. వారిద్దరికీ పరుగుల దాహం ఉందని, దేశం కోసం ఉత్తమ ప్రదర్శన చేయడానికి ఆరాటపడుతుంటారని పేర్కొన్నారు. CTలో ప్రతి గేమ్ తమకు ముఖ్యమేనని తెలిపారు.

News February 2, 2025

English Learning: Antonyms

image

✒ Fabricate× Destroy, Dismantle
✒ Fanatical× Liberal, Tolerant
✒ Falter× Persist, Endure
✒ Ferocious× Gentle, Sympathetic
✒ Feeble× Strong, Robust
✒ Fluctuate× Stabilize, resolve
✒ Feud× Harmony, fraternity
✒ Fragile× Enduring, Tough
✒ Forsake× Hold, maintain

News February 2, 2025

16 మంది ఎంపీలున్న చంద్రబాబు ఏం సాధించారు?: బుగ్గన

image

కేంద్ర బడ్జెట్‌లో APకి నిధులు రాబట్టడంతో CM చంద్రబాబు విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. 12 మంది MPలతోనే బిహార్ CM నితీశ్ అధిక నిధులు సాధించారని, 16 మంది MPలున్నప్పటికీ CBN అసమర్థుడిగా మిగిలారని మండిపడ్డారు. ‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేశారు. నిర్మాణంలో ఉన్న పోర్టులకు నిధులు కోరలేదు. మెడికల్ కాలేజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు’ అని దుయ్యబట్టారు.