News August 28, 2024

పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దు: టీడీపీ ఎమ్మెల్యే

image

AP: ఎమ్మెల్సీ <<13959849>>పోతుల<<>> సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్ఠానానికి రిక్వెస్ట్ చేశారు. ‘దయచేసి ఊసరవెల్లి లాంటి నాయకులను మన పార్టీలోకి తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లను చేర్చుకుంటే అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయతీగా పోరాడిన వాళ్లను అవమానించినట్టే అవుతుంది’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ మధ్యాహ్నం పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు.

Similar News

News January 5, 2026

నల్లమల సాగర్‌పై అభ్యంతరాలెందుకు: రోహత్గి

image

పోలవరం, నల్లమల సాగర్‌పై SCలో విచారణ <<18768178>>వాయిదా<<>> పడిన విషయం తెలిసిందే. AP తరఫున ముకుల్ రోహత్గి, జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర భూభాగంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తరలించడంపై అభ్యంతరాలు ఎందుకు? నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు’ అని TGని ఉద్దేశించి ముకుల్ రోహత్గి వ్యాఖ్యానించారు.

News January 5, 2026

నాభిలో ‘సూక్ష్మ’ ప్రపంచం.. ఇంత కథ ఉందా?

image

మన శరీరం అద్భుత నిలయం. అందులోనూ మన నాభి మరింత ప్రత్యేకం. ఇందులో వేలాది సూక్ష్మజీవులు నివసిస్తాయనే విషయం మీకు తెలుసా? మన నాభిలో ఏకంగా 2,368 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని US నేషనల్ జియోగ్రాఫిక్ పరిశోధనలో తేలింది. స్నానం చేసినా వాటిని తొలగించలేం. విచిత్రమేంటంటే ఇందులో 1,458 జాతులు శాస్త్రవేత్తలకు కూడా కొత్తే. వేలిముద్రల్లాగే ఒకరి బొడ్డులోని బ్యాక్టీరియా మరొకరి దాంట్లో ఉండదని వారు చెబుతున్నారు.

News January 5, 2026

ఆ తెలంగాణ ప్రాజెక్టులు నేనే నిర్మించా: CBN

image

AP:TGలో కృష్ణా నదిపై కల్వకుర్తి, AMR లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులను తానే నిర్మించానని CM CBN తెలిపారు. ‘APలో కృష్ణా డెల్టా మోడ్రనైజేషన్‌తో పొదుపుచేసిన 20 TMCల నీటిని TGకి ఇచ్చి భీమా లిఫ్ట్‌ను పూర్తి చేయించా. గోదావరిపై TGలో గుప్త, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతలు తెచ్చా. APలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి చేపట్టాం. 2014లో పట్టిసీమ చేపట్టాం’ అని గుంటూరులో తెలుగు మహాసభల్లో వివరించారు.