News August 23, 2024
దర్శనం కోసం మధ్యవర్తులను కలవొద్దు: TTD
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు మధ్యవర్తులను సంప్రదించవద్దని TTD సూచించింది. టికెట్ల విషయంలో మధ్యవర్తిత్వం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తమిళనాడులోని ఓ ఇంటర్నెట్ ఆపరేటర్‌పై ఇలాగే కేసు నమోదు చేసినట్లు తెలిపింది. అధికారిక వెబ్‌సైట్(ttdevasthanams.ap.gov.in) లేదా TTD మొబైల్ యాప్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News January 26, 2025
మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
నీటి కింది నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా తాజాగా పరీక్షించింది. ఆ దేశ అధికారిక మీడియా KNCA ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రయోగాన్ని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగం విజయంతో తమ సైన్యం మరింత బలోపేతమైందని హర్షం వ్యక్తం చేసింది. మున్ముందు మరింత బలంగా మారతామని, శత్రువులకు తగిన సమాధానమిస్తామని స్పష్టం చేసింది.
News January 26, 2025
12 రోజుల్లో రూ.260కోట్లకు పైగా కలెక్షన్స్
విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక ప్రాంతీయ సినిమాకు ఇవే అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
News January 26, 2025
ప్లాన్ ప్రకారమే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశాను: తిలక్
ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చెలరేగిన సంగతి తెలిసిందే. 72 రన్స్ చేసిన వర్మ, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ బౌలింగ్‌లో 4 సిక్సులు కొట్టడంపై మ్యాచ్ అనంతరం వివరించారు. ‘ప్రత్యర్థి జట్టులో బెస్ట్ బౌలర్‌ను టార్గెట్ చేయాలని ముందే అనుకున్నా. లక్కీగా షాట్స్ వర్కవుట్ అయ్యాయి. జట్టును గెలిపించాలన్న పట్టుదలతో ఆడాను’ అని స్పష్టం చేశారు.