News May 10, 2024
ఈ పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు!
వేసవికాలం పండ్లు బయట పెడితే పాడవుతాయని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల అవి త్వరగా పాడవడమే కాకుండా విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అరటిపండ్లు, పుచ్చకాయ, యాపిల్స్, మామిడి, లిచీ, రేగు పండ్లు, చెర్రీస్‌ను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టవద్దని సూచిస్తున్నారు.
Similar News
News December 25, 2024
అల్లు అర్జున్ కేసు: AP vs TG రంగు కరెక్టేనా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. కేసులో ప్రధాన నిందితులపై కాకుండా A11 అల్లు అర్జున్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అర్జున్ VS పోలీసులు, అర్జున్ VS రేవంత్‌గా కొనసాగిన నెరేటివ్ ఇప్పుడు AP VS TGగా మారింది. కొందరు కాంగ్రెస్ నేతలు, MLAలు ఆంధ్రావాళ్ల పెత్తనం ఇక్కడేంది? కావాలంటే వెళ్లిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆ పార్టీ వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయి. మరి మీరేమంటారు?
News December 25, 2024
మోహన్ బాబుకు మరోసారి నోటీసులు?
TG: జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు ఇంకా అజ్ఞాతం వీడలేదని తెలుస్తోంది. అరెస్టు నుంచి మినహాయిస్తూ హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా నేడు ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడి కేసులో మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.
News December 25, 2024
ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మరికొన్ని రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో ఈ నెల 29 వరకు, తెలంగాణలో 27 వరకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మిగతా అన్ని స్కూళ్లకు రేపు కూడా సెలవు ఉండగా, ఏపీలో ఆప్షనల్ హాలిడే ఉంది. దీని ప్రకారం కొన్ని పాఠశాలలు గురువారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.