News December 3, 2024
పుష్ప-2ను రిలీజ్ చేయొద్దు.. MLA డిమాండ్
‘పుష్ప’ సినిమాపై ఆర్మూర్ బీజేపీ MLA రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం. ఎర్రచందనం రూ.10 లక్షలుంటే రూ.కోటిలాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు. ఇప్పుడు పుష్ప-2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో? ఆ సినిమాతో యువత పాడవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్లను అరెస్టు చేసి, జైల్లో వేయాలి. ఆ మూవీని రిలీజ్ చేయొద్దు’ అని ఓ ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.
Similar News
News December 4, 2024
కాకినాడ షిప్లో మరోసారి తనిఖీలు
AP: కాకినాడ పోర్టులో డిప్యూటీ CM పవన్ సీజ్ చేయించిన షిప్లో ఇవాళ మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయల్దేరగా, రేషన్ బియ్యం నమూనాలు తీసుకోనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్‌కు అందించనుంది.
News December 4, 2024
హైడ్రా కీలక నిర్ణయం
TG: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని డిసైడ్ అయ్యింది. కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం HYD బుద్ధభవన్‌లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనుంది. చెరువులు, నాలాలు, పార్క్‌ల ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
News December 4, 2024
నేడే థియేటర్లలోకి ‘పుష్ప-2’
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ‘పుష్ప-2’ సినిమా ఇవాళ్టి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 9.30 నుంచే ప్రీమియర్లు పడబోతున్నాయి. సోషల్ మీడియాతో పాటు బయట జనం మధ్యలో కూడా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. మీరు సినిమా ఎక్కడ చూడబోతున్నారు? కామెంట్ చేయండి.