News August 8, 2025
అనుమతి లేకుండా షూటింగ్‌లు చేయొద్దు: ఫిల్మ్ ఛాంబర్

ఫిల్మ్ ఫెడరేషన్‌లోని యూనియన్ల ఏకపక్ష సమ్మె పిలుపు నేపథ్యంలో వారితో ఎలాంటి సంప్రదింపులు జరపవద్దని సభ్యులకు ఛాంబర్ సూచించింది. స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు, ఇతర యూనిట్ల సభ్యులు ముందస్తు సమాచారం/అనుమతి లేకుండా షూటింగ్‌లు చేయొద్దని ఆదేశించింది. నిర్మాతలు, స్టూడియో విభాగ సభ్యులు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. కాగా వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 17, 2026
అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.
News January 17, 2026
నేడు ప్రయాణాలు చేయవచ్చా?

కనుమ రోజు ఊరు దాటొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే ఇంటికొచ్చిన ఆడపడుచులను తిరిగి పంపరు. కానుకలు ఇచ్చి గౌరవంగా చూసుకుంటారు. ఇక ముక్కనుమ విషయానికి వస్తే ప్రయాణాలకు అనువైన రోజని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు ఈరోజు కూడా పండుగ వాతావరణం ఉంటుందని బయలుదేరడానికి సంకోచిస్తుంటారు. కానీ ముక్కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని ఎటువంటి శాస్త్ర నియమాలు లేవు. కాబట్టి కనుమ నాడు ఆగి, ముక్కనుమ రోజున ప్రయాణాలు చేయవచ్చు.
News January 17, 2026
గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ డౌన్

2025 గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ మూడో స్థానానికి పడిపోయింది. నెదర్లాండ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ విడుదల చేసిన జాబితాలో చైనా విశ్వవిద్యాలయాలే ఎక్కువగా ఉన్నాయి. జెజియాంగ్ వర్సిటీ తొలి స్థానం, షాంఘై జియావో రెండో స్థానంలో నిలిచాయి. టాప్ 10లో 8 వర్సిటీలు చైనావే కావడం విశేషం. భారత విశ్వవిద్యాలయాలు టాప్ 100లో చోటు దక్కించుకోలేకపోయాయి.


