News April 5, 2025

ఇలాంటి వారు వ్యాయామం చేస్తున్నారా?

image

శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. కానీ అందరూ వర్కౌట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సర్జరీలు చేయించుకున్నవారు వర్కౌట్లు చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కావచ్చు. ఎముకలు, కండరాల నొప్పులు ఉన్నవారు చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారూ వీటికి దూరంగా ఉంటే మంచిది. గుండె సమస్యలు ఉన్నవారు వ్యాయామం చేస్తే ప్రెజర్ పెరిగి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

Similar News

News April 5, 2025

బాలీవుడ్ అవార్డుల కన్నా ఈ చీర గొప్పది: కంగన

image

ఓ అభిమాని పంపిన కాంచీపురం సిల్క్ చీరను ఉద్దేశించి నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన బాలీవుడ్ అవార్డుల కన్నా అద్భుతమైన చీర ఎంతో బెటర్ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కంగన తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను మెచ్చి ఓ వ్యక్తి ఈ చీరను పంపడం గమనార్హం. జనవరి 17న విడుదలైన ‘ఎమర్జెన్సీ’ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచినా ఓటీటీలో మాత్రం ప్రశంసలు అందుకుంటోంది.

News April 5, 2025

కంచ గచ్చిబౌలిలో 2000 ఎకరాల్లో ఎకో పార్క్‌.. నిజమేనా?

image

TG: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులు అక్కడే HCU భూమితో సహా 2000 ఎకరాలను ఎకో పార్క్‌గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను HCU రిజిస్ట్రార్ దివేశ్ ఖండించారు. అలాంటి ప్లాన్ ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. వర్సిటీని తరలించేందుకు తాము ఒప్పుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని HCU SU VP ఆకాశ్ అన్నారు.

News April 5, 2025

కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే: కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మజ్లిస్ హస్తగతం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే అని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ పదవిని మజ్లిస్ పార్టీకి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, BRS తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఎంఐఎంకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!