News January 25, 2025
ఉదయం 7 గంటల్లోపు ఈ పనులు చేయండి!

*పరగడుపున నీరు తాగాలి. నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.
*ధ్యానం, ప్రాణాయామం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
*15-30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరానికి శక్తి వస్తుంది.
*రోజులో చేయాల్సిన ముఖ్యమైన పనులకు సమయం కేటాయించండి.
*ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోండి.
Similar News
News December 9, 2025
గ్రామ పోరుకు సిద్ధం.. ‘నల్గొండలో ఏర్పాట్లు పూర్తి’

జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని దృష్టికి తీసుకెళ్లారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ వివరాలను నిర్ణీత సమయాల్లో ‘టీ-పోల్’లో నమోదు చేయాలని ఈసీ ఆదేశించారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.
News December 9, 2025
పీకల్లోతు కష్టాల్లో భారత్

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.


