News December 10, 2024
ATM నుంచి చిరిగిన నోట్లు వస్తే ఇలా చేయండి!

కొన్ని సార్లు విత్ డ్రా చేసినప్పుడు ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆ ఏటీఎం లింక్ అయిన బ్యాంక్కు వెళ్లి విత్ డ్రా చేసిన టైం, తేదీ వివరాలతో ఫామ్ నింపితే మంచి నోట్లు ఇస్తారు. అలాగే చిరిగిన, పాడైపోయిన నోట్లనూ ఫామ్ నింపకుండానే మార్చుకోవచ్చు. బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా గరిష్ఠంగా రూ.5వేల వరకు ఇలా మార్చుకునేందుకు వీలుంది.
Similar News
News December 15, 2025
నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్ప్రెస్ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.
News December 15, 2025
ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.
News December 15, 2025
భజన పాటలు వింటున్నారా?

లైవ్లో భజన పాటలు వినడం, పాడటం వల్ల ఎన్నో లాభాలున్నాయట. ఆ పాటలు వింటున్నప్పుడు మన మనసు సానుకూల శక్తిని గ్రహించి, ప్రతికూల శక్తులను బయటకు పంపుతుందట. లయబద్ధమైన శబ్దం మానసిక చికిత్సగా పనిచేసి మన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుందట. వీటికి మనలోని ఏకాగ్రతను పెంచే శక్తి ఉందని నమ్ముతారు. డోపమైన్ విడుదల చేసి, మన భావోద్వేగ స్థిరత్వాన్ని సైతం పెంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సామూహిక భజనలు బంధాలను పెంచుతాయి.


