News December 27, 2024

త్వరగా నిద్ర రావాలంటే ఇలా చేయండి!

image

ప్రస్తుతం ఎంతోమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అలాంటివారికి 10-3-2-1 నియమం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, పడుకునే పది గంటల ముందు టీ/కాఫీ తాగొద్దు. పడుకునే మూడు గంటలలోపే ఆహారం తినాలి. 2 గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్/టీవీ ఆఫ్ చేయాలి. ఇవి పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. SHARE IT

Similar News

News December 28, 2024

ఆస్ట్రేలియన్లకు తెలుగోడి దెబ్బలు!

image

ఆస్ట్రేలియన్లకు తెలుగోళ్లు కొరకరాని కొయ్యలుగా మారారు. కంగారూలపై అప్పట్లో జైసింహా, అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి తమ సత్తా చూపించారు. ముఖ్యంగా మన లక్ష్మణుడు కంగారూల విజయాలకు లక్ష్మణరేఖలు గీస్తే.. తాజాగా నితీశ్ హీరో అయ్యారు. ఈ సీజన్ BGTలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది ఈ తెలుగు కుర్రాడే.

News December 28, 2024

తెలంగాణలో రీఎంట్రీకి ప్లాన్ సిద్ధం!

image

తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు గ్రౌండ్ వర్క్ చేసి, చంద్రబాబు, లోకేశ్‌కు డిటెయిల్డ్ ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. తొలుత మహబూబ్‌నగర్ నుంచి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

News December 28, 2024

నితీశ్‌కు ఏపీ సీఎం అభినందనలు

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ బాదిన తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.