News January 24, 2025
పొట్ట తగ్గాలంటే ఇలా చేయండి!

ప్రస్తుత జీవనశైలితో పెద్ద, చిన్న అన్న తేడా లేకుండా చాలా మందికి పొట్ట వస్తోంది. ఈక్రమంలో పొట్ట ఎలా తగ్గించుకోవాలో వైద్యులు సూచించారు. ‘దీనికోసం రోజూ 2 సార్లు (ఉదయం, రాత్రి) తినాలి. 3 నెలలైనా తగ్గకపోతే.. రోజుకు ఒకసారే తినాలి. మిగతా టైమ్‌లో వాటర్ తాగుతుంటే పొట్ట తగ్గుతుంది. వాటర్‌తోనే ఉండలేమనుకుంటే.. బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ షుగర్ లేకుండా తాగండి’ అని చెప్పారు.
Similar News
News January 1, 2026
పుతిన్ నివాసంపై దాడి అబద్ధం.. రష్యాకు CIA షాక్

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందన్న రష్యా ఆరోపణలను US గూఢచారి సంస్థ CIA కొట్టిపారేసినట్లు అమెరికన్ మీడియా సంస్థలు తెలిపాయి. వాటి కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ లక్ష్యం కేవలం సైనిక స్థావరాలేనని పుతిన్ నివాసం కాదని CIA తెలిపింది. ఈ మేరకు CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ అధ్యక్షుడు ట్రంప్‌నకు నివేదిక సమర్పించారు. ఆధారాలు లేకుండా రష్యా ఆరోపణలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 1, 2026
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ GOపై హైకోర్టు నోటీసులు

AP: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై జారీచేసిన GO 225పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు ఈ నోటీసులిచ్చింది. PILపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
News January 1, 2026
UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.


