News October 2, 2024
ఉదయం లేవగానే ఇలా చేయండి!

ఉదయం లేవగానే పరగడపున గ్లాసు నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే నోటి నుంచి వెలువడే దుర్వాసన కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు. బ్రెష్ చేయకుండా నీళ్లు తాగాలనిపించకపోతే ఆయిల్ పుల్లింగ్ చేయండి. అయితే, ఎలాంటి ఆహారం, పానీయాలు మాత్రం తీసుకోవద్దని సూచిస్తున్నారు.
Similar News
News November 23, 2025
మహబూబాబాద్లో మహిళలకు అధ్యక్ష పదవులు!

మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా మాలోత్ కవిత బాధ్యతలు చేపడుతుండగా, కాంగ్రెస్ అధిష్టానం సైతం డీసీసీ అధ్యక్షురాలిగా భూక్య ఉమాను నియమించింది. ఇద్దరు ఎస్టీ మహిళలను అధ్యక్షులుగా నియమించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వారి ప్రాముఖ్యత పెరిగింది.
News November 23, 2025
అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.
News November 23, 2025
కుజ దోషం అంటే ఏంటి?

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


