News November 13, 2024

మహిళలూ.. ఇలా జుట్టు వేసుకుంటున్నారా?

image

అమ్మాయిలు వెంట్రుకలను వెనక్కి గట్టిగా లాగి పోనీ టేల్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోనీ టేల్స్ వల్ల హెడేక్ రావడంతో పాటు మెడ నరాల్లో నొప్పి పెరిగి నడుము నొప్పి రావొచ్చు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవుతుంది. దురద వల్ల అసౌకర్యానికి లోనవుతారు. నరాలపైన ఒత్తిడి పెరిగి మైగ్రేన్ హెడేక్‌కు దారితీయవచ్చు’ అని చెబుతున్నారు. ఫ్యాషన్ కోసం ఇలా చేయడం మానేయాలంటున్నారు. SHARE IT

Similar News

News December 27, 2025

అస్సాంలో SIR.. 10.56 లక్షల ఓట్లు డిలీట్

image

అస్సాంలో SIR తర్వాత డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను ఎలక్షన్ కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,51,09,754 మంది ఓటర్లు ఉన్నారు. మరో 93,021 మంది డౌట్‌ఫుల్ ఓటర్లు ఉన్నట్టు డ్రాఫ్ట్‌లో చూపింది. మరణించిన వాళ్లు, వలసదారులు, డూప్లికేట్ కలిపి మొత్తంగా 10,56,291 మంది పేర్లను ఎలక్టోరల్ రోల్ నుంచి తొలగించింది. అస్సాంలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News December 27, 2025

టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు

image

NTR ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని CM CBN ప్రశంసించారు. HYDలో జరిగిన NTR ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చమత్కరించారు. ఇక చిన్నప్పుడు తనను చాలామంది IAS చదవమన్నా తాను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని చెప్పారు.

News December 27, 2025

తప్పు ఒప్పుకున్న శివాజీ

image

నటుడు <<18646239>>శివాజీ<<>> క్షమాపణలు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ విచారణలో ఆయన తన తప్పును అంగీకరించారని, కమిషన్ ఛైర్‌పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారని పేర్కొంది. ఇక మీదట మహిళల విషయంలో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. మహిళలను సమ దృష్టిలో చూడాలని, ఇతరుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయరాదని శివాజీకి సూచించినట్లు తెలిపింది.