News October 22, 2024
మీరూ హైపర్సోమ్నియాతో బాధపడుతున్నారా?

రాత్రంతా నిద్రపోయినప్పటికీ కొన్నిసార్లు పగటిపూట కూడా నిద్రమత్తులో ఉండటం, ఏ విషయంపైనా దృష్టి సారించలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇదీ ఓ వ్యాధనే విషయం తెలుసా? దీనిని హైపర్సోమ్నియా అని పిలుస్తారు. దీనివల్ల పని జీవితం, సామాజిక జీవితంతో పాటు ఇంటిపనులు చేయడం సవాలుగా మారుతుంది. నాడీ సంబంధిత, స్లీప్ అప్నియా వంటి వైద్య సమస్యల వల్ల హైపర్సోమ్నియా బారిన పడే అవకాశం ఉంది.
Similar News
News December 25, 2025
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్‌లో ఉద్యోగాలు

భోపాల్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ 3 యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ( సాయిల్ సైన్స్/అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ అగ్రికల్చరల్ ఫిజిక్స్/ప్లాంట్ ఫిజియాలజీ), NET/GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiss.icar.gov.in/
News December 25, 2025
హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా: గడ్కరీ

ఇరాన్ పర్యటన సందర్భంగా తనకు ఎదురైన అసాధారణ అనుభవాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పంచుకున్నారు. ‘2024 జులైలో ఇరాన్ ప్రెసిడెంట్‌గా మసౌద్ ప్రమాణానికి వెళ్లా. పలువురు దేశాధినేతలతోపాటు హమాస్ చీఫ్(ఇస్మాయిల్ హనియే) కూడా ఉన్నారు. ఆయన్ను నేను కలిశా. కార్యక్రమం ముగిశాక హోటల్‌కు చేరుకున్నా. 4AM సమయంలో హమాస్ లీడర్ <<13758903>>చనిపోయారని<<>> చెప్పారు. దీంతో షాక్‌కు గురయ్యా’ అని ఓ బుక్ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు.
News December 25, 2025
కొత్త ఎయిర్‌లైన్స్.. టికెట్ రేట్లు తగ్గేనా?

ఇటీవల ఇండిగో సంక్షోభానికి మోనోపొలి ఓ కారణం. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్రం 3 కొత్త <<18654560>>ఎయిర్‌లైన్స్‌కు<<>> అనుమతిచ్చింది. అయితే ఈ నిర్ణయంతో విమానయాన రంగంలో గుత్తాధిపత్యం తగ్గి టికెట్ రేట్లు దిగివస్తాయా? సర్వీసులు పెరుగుతాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. రేట్ల విషయంలో జోక్యం చేసుకోకుండా ఎన్ని సంస్థలు వచ్చినా ప్రయోజనమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. చిన్నపట్టణాలకూ సర్వీసులపై దృష్టిసారించాలని కోరుతున్నారు.


