News November 7, 2024
కులగణనతో లెక్క తేల్చేస్తారా!

తెలంగాణలో కులగణన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇది జస్ట్ టైం పాస్ అంటూ బీజేపీ కొట్టిపడేస్తోంది. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే ఏమైందంటూ ప్రశ్నిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు సర్వేకు వివరాలు ఇచ్చేది లేదంటున్నారు. అయితే అన్ని వర్గాలకు సర్వేతో ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని, రిజర్వేషన్లు పెరుగుతాయని GOVT చెబుతోంది. TGలో బీసీల లెక్క తేలుతుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి దీనిపై మీరేమంటారు.
Similar News
News December 14, 2025
హైదరాబాద్ ESIC 102 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <
News December 14, 2025
గోవా, కేరళకే పర్యాటకుల ఓటు: సర్వే

చలికాలంలో ప్రయాణాలకు గోవా, కేరళకే దేశీయ పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. ఎయిర్బీఎన్బీ చేసిన సర్వేలో 55% మంది వీటినే టాప్ ఛాయిస్లుగా ఎంచుకున్నారు. సెలవులకు మాత్రమే కాకుండా రిలాక్స్ అయ్యేందుకు, బీచ్లు, బ్యాక్ వాటర్, హెరిటేజ్ వంటి ఆకర్షణలు ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. అటు యువత వారణాసి, బృందావన్ వంటి ఆధ్యాత్మిక పర్యటనలను ఎంచుకుంటున్నారని వెల్లడించింది. మీరు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు?
News December 14, 2025
24 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: టీడీపీ ఎమ్మెల్యే

AP: 2025-26 ఖరీఫ్ సీజన్లో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు TDP ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. 3.24 లక్షల రైతుల ఖాతాల్లో రూ.4,609 కోట్లు జమ చేయడం ఓ రికార్డని చెప్పారు. 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.12,200 కోట్ల విలువైన 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


