News March 30, 2025
చికెన్ తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా?

నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తిన్న వెంటనే పాలు, పెరుగు తీసుకోకూడదు. ఇవి రెండు కలిస్తే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. చికెన్‌తోపాటు బంగాళదుంపలు కలిపి తీసుకోకూడదు. ఇది అధిక బరువుకు దారితీస్తుంది. అలాగే నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు తినకూడదు. రోజూ చికెన్ తింటే కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు రావచ్చని చెబుతున్నారు.
Similar News
News January 16, 2026
రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
News January 16, 2026
IFFCOలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 16, 2026
ముత్యపు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు

చంద్రుడికి ప్రతీక ముత్యాన్ని భావిస్తారు. ఆ ఉంగరం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. అసలైన ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగించి సోమవారం ధరిస్తే మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయట. ఇది కోపం, ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు ఇది మేలు చేస్తుందట. నకిలీ ముత్యంతో లాభాలు ఉండవట.


