News September 12, 2025

వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?

image

వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తక్కువ వేగంతో నడిస్తే క్యాలరీలు బర్న్ కావు. వేగంగా నడిస్తేనే గుండె, కండరాలు బలోపేతం అవుతాయి. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయకూడదు. ఇలా చేస్తే వెన్ను, మెడ నొప్పి సమస్య వస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించి నడవాలి. ఖాళీ కడుపుతో లేదా అతిగా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిది కాదు’ అని చెబుతున్నారు.

Similar News

News March 11, 2026

విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

image

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త సోహైల్‌తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. అతడితో విడాకుల పక్రియ ఇవాళ పూర్తయింది. తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను హన్సిక 2022లో వివాహమాడారు. అయితే అతడికి అప్పటికే రింకీ బజాన్‌తో పెళ్లి జరగ్గా కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్‌, హన్సిక లవ్ మ్యారేజీ చేసుకున్నారు.

News March 11, 2026

స్టాక్ మార్కెట్లు క్రాష్

image

యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫ్లాట్‌గా స్టార్ట్ అయిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ మినహా అన్ని కంపెనీల షేర్లు ఘోర నష్టాలు చవిచూశాయి. FII అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్, ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపించింది.

News March 11, 2026

యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

image

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.