News January 29, 2025
చలికాలంలోనూ ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా?

శీతాకాలంలో ఫ్రిజ్లోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు శరీరంలోని జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. ఇవి కఫాన్ని కలిగించటం వల్ల దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, అజీర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూల్ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. చిగుళ్ల నొప్పి వచ్చి దంత సమస్యలు తలెత్తే ఆస్కారముంది. గది ఉష్ణోగ్రత నీటిని మాత్రమే తాగాలి.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


