News December 23, 2024

పడుకునే ముందు తింటున్నారా?

image

రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.

Similar News

News December 5, 2025

పుతిన్ పర్యటన.. నేడు కీలకం!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 11.50గం.కు <<18467026>>హైదరాబాద్‌ హౌస్‌<<>>లో ఈ మీటింగ్ జరగనుంది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్యం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలపై PM మోదీతో చర్చించనున్నారు. S-400, మిసైళ్ల కొనుగోలు, రూపే-మిర్ అనుసంధానం సహా 25 వరకు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అధునాతన S-500 వ్యవస్థ, SU-57 విమానాల కొనుగోలుపైనా చర్చలు జరపనున్నారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.

News December 5, 2025

అవినీతి అధికారి గుట్టు రట్టు.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు!

image

తెలంగాణ ACB మరో అవినీతి అధికారిని పట్టుకుంది. రంగారెడ్డి(D) సర్వే సెటిల్మెంట్&భూ రికార్డుల ఆఫీసులో ADగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అతనికి HYDలో ఒక ఫ్లాట్, MBNRలో 4 ప్లాట్లు, NRPTలో రైస్ మిల్లు, 3 ప్లాట్లు, అనంతపురం, కర్ణాటకలో 22 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు 4 వీలర్ వాహనాలు, 1.6kgs బంగారం, 770gms వెండి ఉన్నట్లు గుర్తించింది. వీటి వాల్యూ ₹100Cr+ ఉంటుందని అంచనా.