News March 13, 2025

రోజూ చికెన్ తింటున్నారా?

image

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.

Similar News

News March 13, 2025

ఇంటర్ పేపర్లలో తప్పులు.. విద్యార్థుల ఆందోళన

image

TG: ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సెకండియర్ బోటనీలో 2, గణితంలో ఒక తప్పు, మంగళవారం ఫస్టియర్ పేపర్లలో 3 సబ్జెక్టుల్లో 6 తప్పులు దొర్లాయి. సోమవారం సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ అస్పష్టంగా ముద్రించడంతో ఏడో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తామని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు.

News March 13, 2025

ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు రష్యాకు US అధికారులు

image

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణపై మధ్యవర్తిత్వం చేసేందుకు అమెరికా అధికారులు రష్యా బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. ‘మా వాళ్లు రష్యాకు వెళ్లే దారిలో ఉన్నారు. ఈ చర్చలకు మాస్కో సహకరిస్తుందని ఆశిస్తున్నాం. అదే జరిగితే 80శాతం మేర ఈ నరమేధం ఆగినట్లే. అలా కాని పక్షంలో రష్యాను కుదేలుచేసే ఆంక్షలు విధించగలను. కానీ అంతవరకూ రాదని అనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.

News March 13, 2025

₹2,100 చెల్లిస్తే ₹5,00,000.. నిజమిదే!

image

ప్రధానమంత్రి ముద్ర యోజనపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ₹2,100 చెల్లిస్తే ₹5,00,000 ఋణం మంజూరు చేస్తున్నట్లు ఓ నకిలీ ఆమోదిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొంది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా ఋణాలను సూక్ష్మ వ్యవస్థాపకులు/వ్యక్తులకు నేరుగా ఇవ్వదని తెలిపింది.

error: Content is protected !!