News July 20, 2024

వర్షాకాలంలో ఇవి తింటున్నారా?

image

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. మరోవైపు ఈ సీజన్‌లో జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా కాస్త మందగిస్తుంది. కాబట్టి నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్, సమోసా, పానీపూరి వంటివి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సీఫుడ్‌కు దూరంగా ఉండాలి. చేపలు, రొయ్యల పునరుత్పత్తి కాలం కాబట్టి వాటిని తినడం మంచిది కాదు. ఈ సీజన్‌లో ఫంగస్ వచ్చే అవకాశం ఉండటంతో ఆకుకూరలను కూడా తగ్గించాలి.

Similar News

News November 19, 2025

అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

image

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 19, 2025

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

image

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్‌ ఇష్యూస్‌ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్‌&డైలాగ్‌ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News November 19, 2025

కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

image

AP: వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలుస్తోంది.