News March 2, 2025
బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తింటున్నారా?

ప్రస్తుతం చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్నే తింటున్నారు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారంగా పాన్ కేక్స్, వాఫ్పల్స్ తీసుకోకూడదు. వీటిని మైదాతో తయారుచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. డీప్ ఫ్రై చేసిన వడ, పూరీ తినకూడదు. శాండ్విజ్, నూడుల్స్, పరోటా వంటివి తినొద్దు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవన్నీ లేకుండా చూసుకోవడం బెటర్.
Similar News
News November 8, 2025
బిహార్ ఎన్నికల్లో మంత్రి లోకేశ్ ప్రచారం

AP: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మంత్రి లోకేశ్ 2 రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేపు ఉదయం ప్రచారం చేస్తారు.
News November 8, 2025
ప్రభుత్వ స్కూళ్లలో UKG.. 9,800 మందికి ఉద్యోగాలు!

TG: రాబోయే విద్యాసంవత్సరం 2026-27 నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో ప్రారంభించింది. ఒక్కో స్కూల్లో టీచర్ (ఇన్స్ట్రక్టర్), ఆయాను నియమిస్తారు. అంటే 9,800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
News November 8, 2025
స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్ క్లెన్సర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలి. వారానికోసారి స్క్రబ్, ఆరెంజ్ పీల్స్ అప్లై చేయాలి. హైలురోనిక్ యాసిడ్, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.


