News February 15, 2025

చికెన్‌లో ఈ భాగాలు తింటున్నారా?

image

కోడిలో దాదాపు అన్ని భాగాలనూ మనం తింటాం. కానీ దాని మెడ, తోక, ఊపిరితిత్తుల్ని తినకుండా ఉండటమే శ్రేయస్కరమంటున్నారు ఆహార నిపుణులు. ఆ భాగాల్లో ఉండే హానికరమైన క్రిములు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా చర్మంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ ఉంటాయని, స్కిన్ లెస్ తినడమే బెటర్ అని సూచిస్తున్నారు.

Similar News

News October 21, 2025

నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

image

నేవీ చిల్డ్రన్ స్కూల్‌ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్: https://ncsdelhi.nesnavy.in/

News October 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 42 సమాధానాలు

image

1. వాలి ఇంద్రుడి అంశతో జన్మించాడు.
2. కర్ణుడి అంత్యక్రియలను యుధిష్ఠిరుడు నిర్వహించాడు.
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత సరస్వతీ దేవి.
4. త్రిమూర్తులలో లయకారుడు ‘శివుడు’.
5. వాయు లింగం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 21, 2025

మీ జుట్టు పొడిబారిందా? ఇలా చేయండి

image

థైరాయిడ్, PCOS, డయాబెటిస్ వల్ల చర్మం, జుట్టూ పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘సల్ఫేట్ ఫ్రీ ఫార్ములా ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంపిక చేసుకోవాలి. ప్రొడక్టుల్లో హైలురనిక్ యాసిడ్, స్క్వాలిన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. చుండ్రు నివారణకు కీటోకొనజాల్, సెలీనియం సల్ఫైడ్, సాల్సిలిక్ యాసిడ్ ఉన్న లోషన్లను వాడాలి’ అని చెబుతున్నారు.