News March 2, 2025
జ్వరం వచ్చినప్పుడు వీటిని తింటున్నారా?

జ్వరం వచ్చినప్పుడు కొందరు అస్సలు తినరు. మరికొందరు నచ్చినట్లు తింటారు. కానీ ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు, చీజ్, పెరుగు తినకూడదు. తింటే మ్యూకస్ ఉత్పత్తి పెరిగి శ్వాసకోస సమస్యలు వస్తాయి. టీ, కాఫీలో ఉండే కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. తీపి పదార్ధాలు తినకూడదు. మద్యం కూడా సేవించకూడదు. మాంసాహారం శరీరంలో సరిగ్గా జీర్ణం కాదు. దీంతో అజీర్తి, గ్యాస్, విరేచనాలు అవుతాయి.
Similar News
News October 19, 2025
WWC: ఉత్కంఠ పోరులో భారత జట్టు ఓటమి

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 284/6 రన్స్‌కు పరిమితమైంది. స్మృతి మంధాన 88, హర్మన్ ప్రీత్ 70, దీప్తి శర్మ 50 రన్స్‌తో రాణించారు. సులభంగా గెలిచే అవకాశాలున్నా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి, బౌండరీలు బాదకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
News October 19, 2025
RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సైట్: <
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.