News April 2, 2025
ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

సమ్మర్‌లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.
Similar News
News April 6, 2025
న్యూస్ రౌండప్

* AP: అనకాపల్లి ఫార్మా సిటీలో ప్రమాదం.. విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ మృతి
* తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. స్వామిని దర్శించుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా
* TG: శ్రీశైలం SLBCలో 43 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఇంకా దొరకని ఆరుగురి ఆచూకీ
* శ్రీరామనవమి వేళ అయోధ్యలో పెరిగిన భక్తుల రద్దీ
News April 6, 2025
శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

దేశ ప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అన్ని పనుల్లో మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడవాడలా వేడుకలు కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన రాముడి చరిత్రను గుర్తు చేసుకుందామన్నారు.
News April 6, 2025
ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి విడతలో మండలానికి ఓ గ్రామం నుంచి మొత్తం 71 వేల మందిని ఎంపిక చేసింది. ఇప్పుడు మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తం 4.50 లక్షల మందితో జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్‌లోగా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.