News August 19, 2024
ఇదొక అదృష్టంగా భావిస్తున్నా: నిత్యామేనన్

జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని హీరోయిన్ నిత్యామేనన్ అన్నారు. ఇదొక అదృష్టంగా భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అవార్డును ప్రకటించిన తర్వాత నుంచి అభినందనలు తెలిపేందుకు కాల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. అవార్డు వచ్చాక తాను ఎంపిక చేసుకునే చిత్రాలు, టీమ్ మారవని స్పష్టతనిచ్చారు. ‘తిరుచిత్రంబలం’ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం వరించింది.
Similar News
News July 8, 2025
నిధికి పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ క్యూట్ రిప్లై

సాధారణంగా సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు నెట్టింట అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా #asknidhhi అంటూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. నెటిజన్స్ అంతా నిధి హీరోయిన్‌గా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విశేషాలు అడిగారు. ఒకరు మాత్రం ‘మీ అమ్మగారి నంబరిస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా’ అని అన్నారు. అందుకు నిధి ‘అవునా? నాటీ’ అంటూ క్యూట్‌గా రిప్లయ్ ఇచ్చారు.
News July 8, 2025
జులై 8: చరిత్రలో ఈరోజు

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం
News July 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.