News October 13, 2025
నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా?

ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపించడం పలు ఆరోగ్య సమస్యలకు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అది షుగర్ వ్యాధికి సంకేతమని చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు ఎనర్జీ లెవల్స్ తారుమారవుతాయి. దాంతో లేవగానే అలసట, గొంతు ఎండిపోవడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. క్రమంగా అలాంటి లక్షణాలే కనిపిస్తుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
Similar News
News October 13, 2025
యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని: ట్రంప్

యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరి అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘శాంతి కోసం కృషి చేసినందుకు నేనెప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే నా దౌత్యం లక్ష్యం. అంతేకానీ అవార్డుల కోసం కాదు. మిలియన్ల ప్రాణాలను కాపాడాను’ అని తెలిపారు. గాజా యుద్ధం కూడా ముగిసిందని, ఇది తాను పరిష్కరించిన 8వ వార్ అని పేర్కొన్నారు. అఫ్గాన్-పాక్ ఘర్షణల గురించి తెలిసిందని, దానిపైనా దృష్టి పెడతానన్నారు.
News October 13, 2025
భూమికి జనుము, అలసంద చేసే మేలు

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.
News October 13, 2025
నేడు విధుల్లోకి టూరిస్టు పోలీసులు

TG: రాష్ట్రంలోని టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అమల్లోకి రానుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది టూరిస్టు పోలీసులు నేడు విధుల్లో చేరనున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలైన యాదాద్రి, భద్రాచలం, కీసరగుట్ట, సోమశిల తదితర ఆలయాలతో పాటు చార్మినార్, గోల్కొండ, అనంతగిరి హిల్స్ వంటి సందర్శక ప్రాంతాల్లో వీరు అందుబాటులో ఉంటారు.