News September 6, 2025

పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారు!

image

పిల్లల ఏడుపును మాన్పించేందుకు, ఆహారం తినిపించేందుకు కొందరు వారికి ఫోన్ ఇస్తుంటారు. కొందరైతే తమ పిల్లలు సొంతగా యూట్యూబ్ వాడితే ఖుషీ అవుతుంటారు. కానీ పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిది కాదని మానసిక వైద్యుడు శ్రీకాంత్ అంటున్నారు. ‘పిల్లల మెదడు ఎంత మొబైల్ చూస్తే అంత మొద్దుబారుతుంది. ఇంట్లో ఎన్ని తక్కువ బొమ్మలుంటే అంత చురుకవుతుంది. పేరెంట్స్ ఎన్ని మాటలు, కథలు చెప్తే అంత పదునవుతుంది’ అని తెలిపారు.

Similar News

News September 6, 2025

అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా: బన్ని

image

దుబాయ్‌లో జరిగిన SIIMA వేడుకలో అందుకున్న బెస్ట్ యాక్టర్‌(మేల్) అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎల్లప్పుడూ ప్రేమ, గుర్తింపు అందిస్తున్నందుకు SIIMAకి ధన్యవాదాలు. వరుసగా మూడు అవార్డులు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ సుకుమార్, పుష్ప టెక్నీషియన్స్, నిర్మాతలు, చిత్ర బృందం వల్లే ఇది సాధ్యమైంది’ అని బన్ని రాసుకొచ్చారు.

News September 6, 2025

కాబోయే భార్య శృంగారానికి ఒప్పుకోలేదని..!

image

మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు తనకు కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు. పాల్‌ఘర్‌కు చెందిన నీలేశ్ ధోంగ్డాకు, బిబల్దార్‌కు చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి నిశ్చయమైంది. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నీలేశ్ ఇంటికి వెళ్లాడు. శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేయడంతో ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెపై అత్యాచారం చేసి, ఉరేసి చంపాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

News September 6, 2025

గోవా షిప్‌యార్డ్‌లో 30 పోస్టులు

image

<>గోవా షిప్‌యార్డ్<<>> లిమిటెడ్‌లో 30 జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. BE, B.Tech, BSc(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల ఉద్యోగ అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్ట్ బేసిక్ కింద మూడేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అవసరమైతే మరో ఏడాది పొడిగిస్తారు.