News November 22, 2024

మీకు వేగంగా తినే అలవాటు ఉందా..?

image

భోజ‌నం వేగంగా తిన‌డం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని న్యూట్రీషియ‌న్లు హెచ్చ‌రిస్తున్నారు. తినే ఆహారం మాత్రమే కాదు, తినే విధానమూ ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. నిదానంగా భోజ‌నం చేసే వారిలో డయాబెటిస్, PCOD, హై బీపీ వంటి సమస్యలు తక్కువ‌ని వివ‌రిస్తున్నారు. తొందరగా తినే అలవాటు వల్ల జీర్ణకోశ సమస్యలు, అధిక బరువు, మెటబాలిజం సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి Relax and Eat. SHARE IT.

Similar News

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

image

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్‌ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.