News August 10, 2024

మీకు విశ్వసనీయత ఉందా?

image

భార‌త్‌కు సంబంధించి మ‌రో ప్ర‌క‌ట‌న చేస్తామన్న హిండెన్‌బ‌ర్గ్‌ను భార‌తీయులు టార్గెట్ చేశారు. అస‌లు మీకు విశ్వ‌స‌నీయత ఉందా అంటూ కామెంట్లు ఎక్కుపెట్టారు. అదానీ స్టాక్స్ విష‌యంలో చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని తేల‌డంతో హెండెన్‌బ‌ర్గ్ ప్ర‌క‌ట‌న‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో చేసిన ప్ర‌క‌ట‌న త‌రువాత ఇప్పటివరకు సెన్సెక్స్ 20,000 పాయింట్లు గెయిన్ చేసింది.

Similar News

News March 10, 2026

కాసేపట్లో ఇరాన్‌పై భీకర దాడులు: అమెరికా

image

ఇరాన్‌పై కాసేపట్లో ఎప్పుడు లేనంత స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించారు. తాము అనుకున్న సమయానికే ఇరాన్‌తో యుద్ధం ఆపుతామని తెలిపారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. మరోవైపు యూఏఈలోనే అతిపెద్దదైన రువాస్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడి జరిగింది. దీంతో రిఫైనరీ తాత్కాలికంగా మూతపడింది.

News March 10, 2026

AP, TG ఎంత అప్పు చేశాయంటే?

image

2025-26 ఆర్థిక సంవత్సరం 9నెలల్లో AP రూ.56,072Cr, TG రూ.69,300Cr అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. RSలో YCP MP బాబూరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తొలి త్రైమాసికంలో AP రూ.26,572Cr, TG రూ.17,400Cr, రెండో క్వార్టర్‌లో AP రూ.17,600Cr, TG 32,500Cr, మూడో క్వార్టర్‌లో AP రూ.11,900Cr, TG రూ.19,400Cr ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసినట్లు వివరించారు.

News March 10, 2026

ఏజెన్సీల ‘బ్లాక్’ దందా.. భారీ ధరకు సిలిండర్ల విక్రయం!

image

LPG సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏజెన్సీలు సాధారణ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను భారీ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్యాస్ సప్లైలో అంతరాయం ఏర్పడొచ్చని, చూసి వాడుకోవాలంటూ గేటెడ్ కమ్యూనిటీల్లో యాజమాన్యాలు అలర్ట్ SMSలు పంపుతున్నాయి.