News October 12, 2025
డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్నిరకాల పండ్లు తినొచ్చని, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, జామపండు, ఆపిల్, ఆరెంజ్, కివీ, బొప్పాయి, ద్రాక్ష (కొద్ది మోతాదులో) మంచి ఆప్షన్లు అని అంటున్నారు. వీటిని జ్యూస్ చేసుకునే బదులు పండ్లుగా తింటేనే ఆరోగ్యానికి లాభం అని సూచిస్తున్నారు.
Share it
Similar News
News October 12, 2025
స్వీట్లు తినిపించి ముగ్గురు పిల్లల గొంతు కోసిన తండ్రి

ఇన్‌స్టా పరిచయం కుటుంబాన్ని నాశనం చేసింది. తమిళనాడుకు చెందిన వినోద్, నిత్యకు 12 ఏళ్ల క్రితం పెళ్లవ్వగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వినోద్‌కు వ్యాపారంలో నష్టాలు రాగా అదే సమయంలో నిత్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో సంబంధం పెట్టుకుని భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఎంత బతిమాలినా రాకపోవడంతో తాగుడు బానిసైన వినోద్ నిన్న పిల్లలకు స్వీట్లు తినిపించి గొంతు కోసి చంపేశాడు.
News October 12, 2025
దీపావళి బరిలో నాలుగు సినిమాలు

ఈ సారి దీపావళికి బడా హీరోల మూవీలు బరిలో లేవు. దీంతో మీడియం, చిన్న సినిమాలే పోటీ పడుతున్నాయి. తెలుగులో 4 సినిమాలు విడుదల కానున్నాయి. ప్రియదర్శి, నిహారిక నటించిన ‘మిత్రమండలి’(16), సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసుకదా’(17), ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’(17), కిరణ్ అబ్బవరం నటించిన ‘K-Ramp’(18) బరిలో ఉన్నాయి. ఈ చిత్రాల నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్‌కు మంచి స్పందన వచ్చింది. మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?
News October 12, 2025
అనుబంధాల ఆలయమే పెళ్లి

పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఏడడుగుల అనుబంధం. ఏడు జన్మల అనురాగం. ఇది రెండు మనసుల పవిత్ర కలయిక. ఇరువురి జీవితాల ప్రేమానురాగాల అల్లిక. తల్లిదండ్రులను మురిపించి, రెండు కుటుంబాల సంతృప్తిని కొనసాగించే గొప్ప సంస్కారం. శాంతి సౌభాగ్యాల ఉద్భవానికి, ‘నా’ అనే తీయని భావనతో కుటుంబాన్ని ఏర్పాటుచేసుకొనే మొదటి సోపానం. ఓర్పు, సహనం అనే పునాదులపై నిర్మితమయ్యే అందమైన అనుబంధాల సౌధమే వివాహం. <<-se>>#Pendli<<>>