News April 9, 2025
మోదీని విమర్శించే స్థాయి నీకుందా రేవంత్: TBJP

TG: ప్రధాని మోదీపై CM రేవంత్ చేసిన విమర్శలకు తెలంగాణ BJP కౌంటరిచ్చింది. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన నీకు మోదీని విమర్శించే స్థాయి ఉందా? రాహుల్ గాంధీకి ఊడిగం చేసే నువ్వా మాట్లాడేది? అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి పేద ప్రజల కడుపు కొడుతూ పబ్బం గడుపుకునే నువ్వా మాట్లాడేది? విదేశీ గడ్డపైనా ప్రశంసలు పొందిన మోదీని విమర్శించావంటే నీ స్థాయి ఏంటో, నీ కురచ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News December 3, 2025
వరుసగా రెండో రోజూ పతనం.. 90 దాటిన రూపాయి

భారత రూపాయి వరుసగా రెండో రోజూ పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.13కు చేరింది. మంగళవారం అత్యంత కనిష్ఠంగా 89.94 వద్దకు చేరిన రూపాయి నేడు మరింత బలహీనపడింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పతనమైంది. USతో ట్రేడ్డీల్పై అనిశ్చితి, ఈక్విటీల్లోంచి విదేశీ నిధుల ఉపసంహరణ, బంగారం సహా దిగుమతులకు డిమాండ్, ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేస్తుండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు తెలిపారు.
News December 3, 2025
చదరంగంలో సంచలనం సృష్టించిన బుడ్డోడు

MP సాగర్ జిల్లాకు చెందిన మూడేళ్ల సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు. స్మార్ట్ఫోన్ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశంతో చెస్ నేర్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఈ రికార్డు WBకు చెందిన అనీశ్ సర్కార్ (3సం.8నెలలు) పేరిట ఉండేది.
News December 3, 2025
పీఎం మోదీని కలిసిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.


