News October 4, 2025
మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉన్నాయా?

పూజ గదిలో సాధారణ పూజ సామగ్రితో పాటు కొన్ని పవిత్ర వస్తువులు ఉంటే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవుళ్ల చిత్రపటాలతో పాటు గోమాత పటం కూడా ఉండాలని అంటున్నారు. శంఖం, సాలగ్రామం, తామర గింజలు, గవ్వలు, గంగాజలం, నెమలి పింఛం, భగవద్గీత పుస్తకం ముఖ్యమని సూచిస్తున్నారు. వీలైతే గంధపు చెక్కను కూడా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇవి దివ్య శోభను, సానుకూల శక్తిని ఇచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతాయి.<<-se>>#pooja<<>>
Similar News
News October 4, 2025
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత?

ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు UK ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. నీరవ్ భారత్‌కు వచ్చాక మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని భారత ప్రభుత్వం బ్రిటీష్ అధికారులకు హామీ పత్రం అందజేసింది. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. వీటికి సమ్మతించిన ఆ దేశ ప్రభుత్వం ఈ నెల 23న ఆయన్ను అప్పగించే అవకాశాలున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
News October 4, 2025
ఆటో డ్రైవర్ల సామాజిక స్పృహకు కొటేషన్లే నిదర్శనం: లోకేశ్

AP: ఆటో డ్రైవర్ల సమస్యలు తెలిసే CM చంద్రబాబు వారి కోసం కొత్త పథకం తెచ్చారని మంత్రి లోకేశ్ అన్నారు. ఆటోల వెనకుండే కొటేషన్లు చూస్తే వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత తెలుస్తుందన్నారు. ‘అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి’ వంటి కొటేషన్లను గుర్తుచేశారు. ‘హాయ్ అని ఆశ పెట్టొద్దు, బాయ్ అని బాధ పెట్టొద్దు’ అనే ఫన్నీవీ ఉన్నాయన్నారు. ఎవరైనా వస్తువులు మరిచిపోతే నిజాయితీతో అప్పగిస్తున్నారని మెచ్చుకున్నారు.
News October 4, 2025
సినీ ముచ్చట్లు!

*పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా నుంచి దీపావళి రోజున అప్డేట్ రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. మూవీ విడుదల తేదీని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
* సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ నవంబర్ 15న మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.