News November 12, 2024
మీకూ ఉందా ఈ సమస్య?

మనలో చాలామంది ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మరొకరిపై చూపిస్తుంటాం. దీన్నే డిస్ప్లేస్డ్ యాంగర్ లేదా మిస్ప్లేస్డ్ యాంగర్ అని అంటుంటారు. దీనికి ప్రతిసారి మనుషులే కాదు కొన్నిసార్లు వస్తువులు కూడా బలవుతుంటాయి. ఈ సమస్య ఉంటే ఆఫీస్లో బాస్ పెట్టిన ఒత్తిడి వల్ల ఇంటికి వచ్చి భార్య, పిల్లలపై అరుస్తుంటారు. దీని వల్ల రిలేషన్షిప్ దెబ్బతినడంతో పాటు మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
Similar News
News November 28, 2025
దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. అతి భారీ వర్షాలు!

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాను గంటకు 7KM వేగంతో పయనిస్తున్నట్లు IMD వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంకకు 50KM, చెన్నైకి 540KM, పుదుచ్చేరికి 440KM దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ NOV 30న తమిళనాడు-దక్షిణ కోస్తా తీరానికి చేరే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపటి నుంచి DEC 4 వరకు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
సెబీలో పెరిగిన పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెబీలో 110పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా 135కు పెంచారు. జనరల్ విభాగంలో 56 పోస్టులకుగాను 77కు, రీసెర్చ్ విభాగంలో 4 ఉండగా.. 8కి పెంచారు. మిగిలిన విభాగాల్లో పోస్టులను పెంచలేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ / PG డిప్లొమా, LLB, BE/B.Tech, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: sebi.gov.in


