News March 7, 2025

ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే సెలవు కట్?

image

ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను నేరుగా యాప్‌లో ఆమోదించదని తెలుస్తోంది. నెలలో 10 రోజులు కచ్చితంగా కార్యాలయానికి రావాల్సిందేనని ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ రాకపోతే వారి సెలవులను కట్ చేస్తారంటున్నాయి. దీనిపై త్వరలో ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News November 6, 2025

KGF నటుడు కన్నుమూత

image

కేజీఎఫ్ నటుడు <<17572420>>హరీశ్ రాయ్<<>> కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.

News November 6, 2025

మొత్తానికి ట్రంప్‌కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

image

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్‌కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్‌లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్‌బాల్-పీస్ రిలేషన్‌ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.

News November 6, 2025

MOILలో 99 ఉద్యోగాలు

image

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<>MOIL<<>>)లో 99 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. ఎలక్ట్రీషియన్, మెకానిక్ కమ్ ఆపరేటర్ , మైన్ ఫోర్‌మెన్, సెలక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్, మైన్‌మేట్, బ్లాస్టర్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్‌సైట్: https://www.moil.nic.in/