News February 6, 2025
నిద్రలో మూత్రం ఆపుకుంటున్నారా?
మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుంది. రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్ర డిస్టర్బ్ అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News February 6, 2025
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రద్దు
AP: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసేవారు. అర్హత ఉండి ఏదైనా పథకం అందకపోతే అప్లై చేసేవారు. అయితే ఇది వైసీపీ కార్యక్రమంగా మారిందని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
News February 6, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 6, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఫిబ్రవరి 06, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.