News October 24, 2025
కృత్రిమ వర్షం గురించి తెలుసా?

క్లౌడ్ సీడింగ్ అనే విధానంలో <<18087168>>కృత్రిమ<<>> వర్షాన్ని కురిసేలా చేస్తారు. ఈ పద్దతిలో ప్రత్యేక విమానాలు నల్లని(నింబోస్ట్రాటస్) మేఘాలపైకి వెళ్లి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాల మిశ్రమాన్ని చల్లుతాయి. దీంతో ఆ మేఘాలలోని నీటి బిందువుల ఘనీభవించి వర్షంగా కురుస్తాయి. ఈ ప్రక్రియకు 30 నిమిషాల సమయం పడుతుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం దీని కోసం రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 24, 2025
అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

అయోడిన్ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్ లోపిస్తే గాయిటర్, రొమ్ముల్లో క్యాన్సర్ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News October 24, 2025
బస్సు ప్రమాదం: నువ్ చాలా పెద్ద తప్పు చేశావ్

డ్రైవర్‌నే దేవుడిగా భావించి ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కుతారు. కానీ <<18087723>>vKaveri<<>> విషాదంలో మెయిన్ డ్రైవర్ తప్పులు చేశాడనే విమర్శలొస్తున్నాయి. బైక్‌ను ఢీకొట్టగానే బస్ ఆపితే మంటలు చెలరేగేవి కాదు. పైగా ఫైర్ సేఫ్టీతో కాక నీటితో మంటలు ఆర్పే యత్నం చేసి పరిస్థితి చేయి దాటిందని పారిపోయాడు. కనీసం ప్యాసింజర్స్ దిగేలా డోర్ తీయాల్సింది. ప్రమాదంతో హైడ్రాలిక్ కేబుల్స్ తెగి డోర్ తెరుచుకోక చాలామంది బయటకు రాలేక చనిపోయారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై PM మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై AP Dy.CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు విజ్ఞప్తి చేశారు.


