News January 26, 2025

డా.నాగేశ్వర్‌రెడ్డి గురించి తెలుసా?

image

దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డా. నాగేశ్వర్‌రెడ్డి నిలిచారు. 2002లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ ప్రకటించింది. వైజాగ్‌లో జన్మించిన ఆయన కర్నూలులో MBBS, మద్రాస్‌లో MD, చండీగఢ్‌లో DM పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదిగి HYDలో AIG ఆస్పత్రిని స్థాపించారు. రూ.కోట్ల జీతం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలను అందిస్తున్నారు.

Similar News

News November 22, 2025

తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

image

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్‌పేట మాజీ మేయర్ చిగురింత నర్సింహా రెడ్డి, చేవెళ్ల నుంచి భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్‌నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

image

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.