News March 27, 2024

EVM గురించి మీకివి తెలుసా?

image

ఎన్నికలప్పుడు తరచూ EVM అనే మాట వినిపిస్తుంది. EVM అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్. ఓటర్లు వేసిన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేసి లెక్కిస్తుంది. ఓట్లు వేసే సమయంతో పాటు లెక్కింపు సమయాన్ని కూడా తగ్గిస్తుంది. హైసెక్యూరిటీ ఫీచర్లతో తయారు చేయడంతో వీటిని హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇవి విద్యుత్‌పై ఆధారపడకుండానే పని చేస్తాయి. వేసిన ఓటును మాత్రమే నమోదు చేస్తాయి.

Similar News

News January 17, 2026

సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

image

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.

News January 17, 2026

అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

News January 17, 2026

మరో రెండు అమృత్ భారత్ ట్రైన్లు

image

TG: తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న PM మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.