News December 6, 2024
‘గరం మసాలా’ గురించి మీకీ విషయం తెలుసా!

గరం మసాలాతో భారతీయుల బంధం ఈనాటిది కాదు. కొన్ని వేల ఏళ్ల కిందటే ఆహారంలో దీనిని భాగం చేసుకున్నారు. మితంగా తింటే ఔషధంగా పనిచేసే ఈ దినుసుల కోసం యుద్ధాలే జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 36 మసాలా పొడులను పరీక్షించిన టేస్ట్ అట్లాస్ భారతీయ గరం మసాలాకు రెండో ర్యాంకు ఇచ్చింది. ఇక చిలీలో దొరికే చిల్లీ పెప్పర్ అజితో చేసిన పొడికి NO1 ర్యాంకు కట్టబెట్టింది. జాటర్, జెర్క్, షిచిమి టొగారషి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News November 25, 2025
పిల్లల కోసం ‘బాల భరోసా’.. త్వరలో ప్రారంభం!

TG: ఆరోగ్య సమస్యలున్న 0-5ఏళ్లలోపు పిల్లలకు ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకాన్ని తీసుకొస్తోంది. CM రేవంత్ త్వరలో దీనిని ప్రారంభిస్తారని సమాచారం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి 42 అంశాలపై ఇంటింటి సర్వే చేశారు. 18లక్షల మంది డేటా సేకరించగా 8 లక్షల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్సతో ఈ సమస్యల్ని పోగొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
News November 25, 2025
ఆంజనేయుడే కాదు.. ఆయన తోక కూడా అంతే శక్తిమంతమైనది..

నారద పురాణం ప్రకారం.. ఆజన్మ బ్రహ్మచారి హనుమాన్ లాంగూలం(తోక) సాక్షాత్తు రుద్రుడి రూపమని చెబుతారు. అందుకే ఆయన తోకను కూడా పూజిస్తే కష్టాలు కానరాకుండా పోతాయని నమ్ముతారు. ‘పూర్వం, భీముడు కూడా ఆయన తోకను కదపలేకపోయాడు. తులసీదాస్ ‘హనుమాన్ బాహుక్’ స్తోత్రంతో హనుమ లాంగూల స్పర్శను కోరి తన బాధలను పోగొట్టుకున్నారు. లాంగూల స్తోత్ర పఠనం రోగాలు, కష్టాలను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది’ అని పండితులు చెబుతారు.
News November 25, 2025
మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా (SM) వాడకుండా నిషేధం విధించాలని మలేషియా నిర్ణయించింది. 2026లో ఇది అమల్లోకి రానుంది. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెదిరింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పిల్లలు SM వాడితే పేరెంట్స్కు ఫైన్ వేయాలని భావిస్తోంది. కాగా టీనేజర్లకు DEC నుంచి SMను నిషేధిస్తామని ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియాలోనూ ఇలాంటి రూల్ అమలు చేయాలంటారా?


