News October 14, 2025
భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
Similar News
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <
News October 14, 2025
విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

APలోని విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2025
అఫ్గాన్, పాక్ మధ్య మళ్లీ హోరాహోరీ పోరు

పాక్, అఫ్గానిస్థాన్ మధ్య మళ్లీ హోరాహోరీ ఘర్షణ తలెత్తింది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ తమ పౌరులను టార్గెట్ చేసుకొని కాల్పులు జరుపుతోందని అఫ్గాన్ ఆరోపించింది. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని వివరించింది. తమ సైన్యం కూడా దీటుగా బదులిస్తోందని పేర్కొంది. కాగా ఇటీవల జరిగిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గాన్ ప్రకటించడం తెలిసిందే.