News July 25, 2024

జ్యోతి యర్రాజీ గురించి తెలుసా?

image

విశాఖకు చెందిన జ్యోతి తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డు. తల్లి ఆస్పత్రి, ఇళ్లల్లో పనులు చేస్తుంటారు. 1999లో జన్మించిన జ్యోతి.. 24 ఏళ్లకే 100 మీటర్ల హార్డిల్స్‌లో నేషనల్ రికార్డులను బద్దలుకొట్టారు. గతేడాది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పటివరకు 3 సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచారు. వరల్డ్ ర్యాంకింగ్ కోటాలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.

News November 21, 2025

ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

image

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.

News November 21, 2025

ఆముదంతో ఎన్నో లాభాలు

image

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఇ, యాంటి ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.