News September 3, 2025
పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ గురించి తెలుసా?

చాలామంది స్త్రీలలో గర్భాశయం, ఫెలోఫియన్ ట్యూబ్‌లు, అండాశయాల్లో పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ వస్తుంది. క్లామీడియా, గోనోరియా బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రోగనిరోధక శక్తి లేకపోవడం, ప్రసవం, గర్భస్రావం తర్వాత కొన్నిసార్లు ఈ సమస్య వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే వంధ్యత్వ ప్రమాదం ఉంది. పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి.
Similar News
News September 5, 2025
ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.
News September 5, 2025
సెప్టెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

1884: ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు కె.గోపాలకృష్ణమాచార్యులు జననం
1888: భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం(ఫొటోలో)
1955: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎం.కోదండరాం జననం
1995: తెలుగు హాస్య నటి గిరిజ మరణం
1997: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణం
* జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
News September 5, 2025
యంగ్ సెన్సేషన్.. వన్డేల్లో చరిత్ర సృష్టించాడు

సౌతాఫ్రికా యంగ్ క్రికెటర్ మాథ్యూ బ్రిట్జ్‌కే వన్డేల్లో చరిత్ర సృష్టించారు. తొలి ఐదు వన్డే మ్యాచ్‌లలో 50+ స్కోర్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 85 రన్స్ చేసిన బ్రిట్జ్‌కే ఈ ఫీట్ సాధించారు. ఈ 26 ఏళ్ల యంగ్ సెన్సేషన్ న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లోనే 150 రన్స్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత పాక్‌పై 83, AUSపై 57, 88, తాజాగా ENGపై 85 రన్స్ చేశారు.