News August 10, 2024
పిక్టోగ్రామ్స్ గురించి తెలుసా..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723275839915-normal-WIFI.webp)
పిక్టోగ్రామ్స్ అనేవి చిత్రలేఖనం ద్వారా సమాచారాన్ని అందించే చిహ్నాలు. వీటిని ఒలింపిక్స్‌లో మొదటిసారిగా జపాన్ (1964) ఉపయోగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇతర దేశాల క్రీడాకారులకు జపనీస్ అర్థం కాకపోవడంతో జపాన్ ఈ ఎత్తుగడ వేసింది. నిజానికి పిక్టోగ్రామ్స్ వాడకం 5 వేల ఏళ్ల క్రితం మెసొపొటేమియా, ఈజిప్ట్‌లో ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది.
Similar News
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737611577062_81-normal-WIFI.webp)
AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
News February 6, 2025
BREAKING: భారత్ విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852236716_367-normal-WIFI.webp)
ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.
News February 6, 2025
ఏనుగులూ పగబడతాయ్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738837413360_746-normal-WIFI.webp)
పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.