News April 30, 2024

రోహిత్‌శర్మ గురించి మీకివి తెలుసా?

image

ఈరోజు రోహిత్‌శర్మ జన్మదినం. అంతర్జాతీయ వేదికపై ఎన్నో రికార్డులు నెలకొల్పి ఇండియన్ క్రికెట్ సత్తా చాటారు. అయితే.. రోహిత్‌ గురించి మీకెంత తెలుసో ఈ ప్రశ్నలకు సమాధానాల రూపంలో కామెంట్ చేయండి.
1. రోహిత్ MI జట్టుపై సాధించిన రికార్డు?
2. వరల్డ్ కప్‌ చరిత్రలో రోహిత్ సెంచరీలెన్ని?
3. హిట్‌మ్యాన్ కాకుండా రోహిత్‌కున్న మరో నిక్‌నేమ్ ఏంటి?
4. రోహిత్ పేరిట వన్డేల్లో ఎన్ని డబుల్ సెంచరీలున్నాయి?

Similar News

News March 5, 2026

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్

image

పొడవైన విద్యుత్ లైన్లలో(25 కి.మీ కంటే ఎక్కువ) విద్యుత్ సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించడానికి
ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు బిగిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. 33KV ఫీడర్లలో 775, 11KV ఫీడర్లలో 15352 ఇన్‌స్టాల్ చేశామన్నారు. లైన్లను జీఐఎస్ మ్యాప్పింగ్ 33 కేవీ 671 ఫీడర్లలో 14544 కిలో మీటర్లు,11 కేవీ 4471 ఫీడర్లలో 40572 కిలో మీటర్లు పూర్తి చేశామని చెప్పారు.

News March 5, 2026

❤️నచ్చేశావ్ సంజూ..

image

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.

News March 5, 2026

విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.