News October 18, 2024
రెండు ఖండాలను కలిపే బ్రిడ్జ్ గురించి తెలుసా?

రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉండటం కామన్. కానీ, 2 ఖండాలను కలిపే వంతెన గురించి మీకు తెలుసా? నార్త్ అమెరికా, యూరప్ ఖండాలను కలిపే ‘బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్’ అనే ఫుట్ బ్రిడ్జి ఐస్లాండ్లో ఉంది. 50 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని దాటితే గ్రీన్స్లాండ్స్పై అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈజీగా ఖండాన్ని దాటొచ్చు. భూమిపై ఏర్పడిన చీలికతో ఖండాన్ని విభజించిన గుర్తులు కనిపిస్తాయి.
Similar News
News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.
News November 3, 2025
శక్తిమంతమైన శివ మంత్రాలు

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. కరచరణా కృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా
సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహదేవ్ శంభో
News November 3, 2025
నిజమైన శివపూజ ఇదే!

శివపూజకు అన్నీ ఉండాలనుకోవడం మన అపోహ మాత్రమేనని పండితులు చెబుతున్నారు. శివుడు కోరేది నిర్మలమైన మనసు మాత్రమేనని అంటున్నారు. ఎలాంటి ఆడంబరాలు లేకపోయినా భక్తితో ‘స్వామి! నన్ను రక్షించు’ అని అడిగినా ఆయన ప్రసన్నుడవుతాడని పురాణాల వాక్కు. శివుడి పట్ల మనసు స్థిరంగా ఉంచడమే అసలైన శివభక్తి అని నమ్మకం. ఆయనతో కష్టసుఖాలు చెప్పుకొని, లాలించి, అలిగి, బుజ్జగించే మానసిక అనుబంధాలే అత్యంత ప్రీతిపాత్రమైనవని అంటారు.


