News March 2, 2025
జెలెన్స్కీ గురించి తెలుసా?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూదు మతానికి చెందిన వ్యక్తి. ఆయన పూర్వీకులు జర్మన్ నాజీల చేతిలో హత్యకు గురయ్యారు. జెలెన్స్కీ 1978లో జన్మించారు. 20 ఏళ్లకు పైగా టీవీ ప్రోగ్రాంలలో నటుడిగా, స్టాండప్ కమెడియన్గా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ ప్రారంభించి 2018లో Servant of the People అనే పార్టీని స్థాపించి, 2019లో ఘనవిజయం సాధించారు. ఈయన ఆస్తి రూ.260 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
Similar News
News January 5, 2026
కోమా నుంచి బయటపడ్డ మార్టిన్

కోమాలోకి వెళ్లిన AUS మాజీ క్రికెటర్ <<18721780>>మార్టిన్<<>> అందులో నుంచి బయటపడ్డారని మాజీ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్ వెల్లడించారు. ‘గత 48 గంటల్లో అద్భుతం జరిగింది. అతడు చికిత్సకు స్పందిస్తున్నాడు. మాట్లాడగలుగుతున్నాడు. అతడిని ICU నుంచి వేరే వార్డుకి మార్చవచ్చు. ఇది ఒక పాజిటివ్ విషయం. అతడికి ఇంకొంతకాలం ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. మార్టిన్ Meningitis అనే వ్యాధితో బాధపడుతున్నారు.
News January 5, 2026
వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.
News January 5, 2026
AIIMS రాయ్పుర్లో 115పోస్టులు… అప్లై చేశారా?

<


