News September 13, 2025
మీకు ‘చిన్న తిరుపతి’ తెలుసా?

AP: ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’. ఇక్కడ స్వామివారు వెంకన్న రూపంలో కొలువై ఉన్నారు. ఇది ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి సంతానానికి, మరొకటి పెళ్లి సంబంధాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు.
Similar News
News February 16, 2026
గర్భిణీలకు టిఫా స్కాన్ ఎందుకు?

టిఫా అంటే ‘టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్’. గర్భిణులకు 18-22 వారాల మధ్య ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. శిశువు, మాయ పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నవి ఇందులో గుర్తిస్తారు. ఈ స్కాన్ ద్వారా చిన్నారుల్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
News February 16, 2026
SETSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech (CS, IT, IS, సైబర్ సెక్యూరిటీ, ECE), ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000-రూ.60,000 వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://setsindia.in
News February 16, 2026
సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.


