News November 4, 2024
తెలుసా.. కొకైన్‌ను ఔషధంగా వాడారు!

డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడల్లా బాగా వినిపించే పేరు కొకైన్. అయితే 1880ల్లో ఆస్ట్రియా న్యూరాలజిస్ట్ సెగ్మండ్ ఫ్రెడ్ దీనిపై అనేక పరిశోధనలు చేసి పలు చికిత్సలకు ఔషధంగా వాడారు. దీర్ఘకాలిక నొప్పి నుంచి ఉపశమనం కోసం తన స్నేహితుడికి కొకైన్‌ను ఇవ్వగా, అతను దానికి ఎడిక్ట్ అయ్యాడు. ఆ తర్వాత దీని డోస్ ఎక్కువై మరణాలు సంభవించడంతో కొకైన్‌ను ఔషధంగా వాడటం నిలిపివేశాడు.
➼డ్రగ్స్ ప్రాణాంతకం.
Similar News
News February 9, 2026
మాఘ స్నానం ఇంకా చేయలేదా?

మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో నదీ స్నానాలు చేయాలంటారు. ఒకవేళ చేయలేకపోతే చివరి రోజు ఓ పరిహారం పాటించాలంటున్నారు పండితులు. అలా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ‘ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే కర్పూరంలో 11 లవంగాలు వేయాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపాలి. ఆర్థిక ఇబ్బందుల తొలగింపునకు తమలపాకుపై కుంకుమపువ్వుతో ‘శ్రీ’ అని రాసి పూజ గదిలో ఉంచాలి. భార్యాభర్తలు దీపారాధన చేయాలి’ అని సూచిస్తున్నారు.
News February 9, 2026
రూ.3వేల కోట్లతో రోడ్ల నిర్మాణం: సీఎం

AP: వచ్చే మూడేళ్లలో అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో అన్నారు. పోలవరాన్ని 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీతో 16వేల టీచర్ ఉద్యోగాలు, 5వేల కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామన్నారు. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశామని, మరో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
News February 9, 2026
గేమింగ్ స్కామ్.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్‌ను DGGI అధికారులు బయటపెట్టారు. ఫిన్‌టెక్ పేరుతో ₹5వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. పలు వెబ్‌సైట్లతో అక్రమ దందా చేశారని, GST ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఓషనీక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే షెల్ కంపెనీలకు రెంటెడ్ ఖాతాలతో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, మాస్టర్‌మైండ్ దుబాయ్‌లో ఉన్నాడని సమాచారం.


