News November 22, 2024
‘హలో’ ఎలా వచ్చిందో తెలుసా?
ఫోన్ ఎత్తగానే ‘హలో’ అని పలకరిస్తుంటాం. అసలు ఈ పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం holla, hollo అనే రెండు పదాల నుంచి వచ్చింది. దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడతారు. బ్రిటిష్ జర్నలిస్టు బ్రిసన్ ప్రకారం ‘hale be thou’ అనే ఓల్డ్ ఇంగ్లిష్ ఫ్రేజ్ నుంచి తీసుకోగా, ‘ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం’ దీని అర్థం. ‘హలో’ అనే పదాన్ని మాత్రం ఎడిసన్ సిఫారసు చేశారు.
Similar News
News November 22, 2024
మా ఇంట్లో జరిగింది రేవ్ పార్టీ కాదు.. బర్త్ డే పార్టీ: సుష్మిత
TG: మంత్రి <<14675277>>కొండా సురేఖ<<>> ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని జరుగుతోన్న ప్రచారంపై ఆమె కూతురు సుష్మితా పటేల్ స్పందించారు. తమ ఇంట్లో జరిగిందని రేవ్ పార్టీ కాదని, తన కూతురి పుట్టినరోజు వేడుక అని వెల్లడించారు. ఆ బర్త్ డే పార్టీలో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదన్నారు. సురేఖ తన స్టాఫ్‌ను ఇంట్లో వాళ్లుగానే చూసుకుంటారని, అందుకే వేడుకకు వాళ్లను ఆహ్వానించారని ఆమె చెప్పారు.
News November 22, 2024
‘కుర్చీ’ దక్కేదెవరికి? మహారాష్ట్రలో అంతర్గత పోరు!
ఇంకా ఫలితాలే వెలువడలేదు. మహారాష్ట్రలో 2 కూటముల్లో CM కుర్చీ కోసం పోరు మొదలైంది! క్రితంసారి ఏక్నాథ్ శిండేకు అవకాశం ఇవ్వడంతో ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పదవి అప్పగించాలని BJP నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎంగా శిండేనే కొనసాగుతారని శివసేన నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రానప్పటికీ కాంగ్రెస్ కూటమి గెలుపు ధీమాతో ఉంది. సీఎం పదవి తమకే వస్తుందని కాంగ్రెస్, శివసేన UBT చెప్పుకుంటున్నాయి.
News November 22, 2024
స్కూళ్ల సమయం పెంపుపై లోకేశ్ క్లారిటీ
AP: స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు MLAలు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన అన్నారు. పైలట్ ప్రాజెక్టుగానే అమలు చేస్తున్నామని, ఫీడ్ బ్యాక్‌కు తగ్గట్లు సమయం మార్చుతామని తెలిపారు. హైస్కూళ్లు ఉదయం 9- 4గంటల వరకు పని చేస్తుండగా, 5వరకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని 2స్కూళ్లలో ఇది అమలు అవుతోంది.